గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 91వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

91. దీనావనాభిరత మౌనంబదేల? నను నీ నీడలో నిలుపఁగా. 

జ్ఞానాంజనంబు నిక నానేత్రపాళికిని రాణింపఁ జేయ పులమన్.

దానాది సద్గుణములే నేర్పు నాకికను ధ్యానించి నిన్ను కొలుతున్

నే నేల కోరవలె? నీ నీడనై  నిలుచు నే నీవె కాగను సతీ!

భావము.

ఓ సతీ మాతా! దీనులను కాపాడుటయందు ఇష్టము గల ఓ తల్లీ! నన్ను 

రాణింపఁ జేయుటకు జ్ఞానమనెడి కాటుకను నా కన్నులకు ఆద్దుటకు నీ నీడలో 

నన్ను నిలుపుటకు మౌనము వహించుటెందులకమ్మా? నిన్నే ధ్యానిస్తూ 

సేవించుచు కొలిచెదను నాకు దానము చేయుట మున్నగు సద్గుణములనే 

నేర్పుము తల్లీ! నీ నీడనయి నిలుచుచున్న నేనే నీవు కాగా నేనింక నిన్ను 

యెందులకు కోరవలెనమ్మా? కోరవలసిన అవసరము లేదుకదా. అంతా నీవే 

చూసుకొందువు కదా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.