గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 90వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

90. ప్రారబ్ధ కర్మ ఫలమేరీతిఁ బాయనగు వారాహి. మాకు చెపుమా.

శ్రీరామ రక్షగ మరేమంత్రమున్నదిల నీరమ్య నామమదియౌన్.

భారంబు నీదె కద పేరాశ బాపఁగను. శ్రీరమ్య తేజస హృదిన్

వారించి దుర్గతి నివారించు తల్లివిగ. శ్రీరమ్య తేజస సతీ!

భావము.

మంగళప్రదమయిన తేజస్వరూపిణివయిన ఓ సతీ మాతా! ఓ వారాహీ! మాకు 

సంభవించు ప్రారబ్ధ కర్మఫలములను ఏ విధముగా మేము 

వదిలించుకొనగలమే సెలవిమ్ముతల్లీ! మాకు శ్రీరామ రక్షగా నిలుచు 

మంత్రమేది యున్నదమ్మా నీ నామ మంత్రము మాత్రమే అగును కదా. 

మాలో చోటు చేసుకొనియుండు పేరాశను పోగొట్టే భారము నీదేనమ్మా. 

మంగళప్రదమయిన తేజస్స్వరూఇణీ! తల్లిగా నీవు పేరాశను పోగొట్టి మా 

దుర్గతిని నివారించుమమ్మా. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.