గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 87వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

87. కామాంధు లీ జగతి నేమాత్రమున్ వరుసలేమీ గణింపరు మదిన్.

ప్రేమన్ నటించుచును కామంబు తీర్చుకొని  యేమాత్రమున్ దొరకరే.

ఓమాత! దుష్టతతినేమాత్రమున్ విడకసేమంబు కొల్లగొనుమా.

రామామణీ. జనుల ప్రేమానురాగముల నీమంబు కొల్పుము సతీ!

భావము.

ఓ సతీ మాతా! ఈ సృష్టిలో కామాంధులుఏమాత్రమూ వావి వరసలు 

చూడకుండా పైకి ప్రేమను నటించుచు వారి కోరికను తీర్చుకొని, అస్సలు 

బయటపడరమ్మా . ఓ తల్లీ! ఇటువంటి దుర్మార్గులను యెంతమాత్రమూ 

విడిచిపెట్టక వారి క్షేమమును దూరము చేయుము  స్త్రీలలో మణివైన ఓ 

తల్లీ! ప్రజల ప్రేమానురాగమలకునియమ బద్ధతనేర్పరచుమమ్మా. 

నియమబద్ధతనేర్పరచుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.