గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 88వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

88. హైమాద్రి పుత్రివగు శ్రీమాత నీ చరణ మేమాత్రమైన తలవన్

కామాదులే తొలగి క్షేమామృతంబొదవు భూమిన్ నిజంబిదెకదా.

మామీద చూపు దయ కేమేమి చేయఁగలమో మాతరో తమకిలన్.

ప్రేమామృతంబువగు మామాతగా కొలుతు మోమంగళాకర సతీ!

భావము.

మంగళములకు స్థానమయిన ఓ సతీ మాతా! ఓ హైమా! హిమవంతుని 

పుత్రికవైన ఓ శ్రీమాతా! నీ పాదములను ఏ మాత్రము భావించినను మాలో 

కామాదులు తొలగిపోయి, క్షేమమనే అంఋతము మాకు లభించునుకదా తల్లీ! 

ఈ భూమిపై ఎదే నిజమమ్మా.  ఓ తల్లీ! ఈ పృథ్విపై మామీద నీవు చూపించే 

దయకు ప్రతిగా మేము నీకేమి చేయగలమమ్మా? ప్రేమాంఋతమువైన నిన్ను 

మా తల్లిగా ఆరాధింతుమమ్మా!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.