గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 86వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

86. రాజాధిరాజయినఁ బూజింపకున్న నిను నాజీవి వ్యర్థుఁడె భువిన్.

రాజీవ లోచన! విరాజిల్లఁ జేసెదె సదా జీవు లెన్నుటను నిన్.

సౌజన్యమున్ గలుఁగు రాజన్యులన్ నిలుపు మా జీవనైకఫలమా!

నా జీవితాంతమును బూజింపనిమ్ము నిను సౌజన్యరూపిణి సతీ!

భావము.

సౌజన్య స్వరూపిణివయిన ఓ సతీ మాతా! రాజాధిరాజే అయినప్పటికీ 

నిన్నుపూజింపనివాడయినచో వాని జన్మమే నిరర్థకమమ్మా.  పద్మములవంటి 

కన్నులుగల ఓ తల్లీ! నిన్నెల్లప్పుడూ జీవులు భావించుచుండునంతనే 

వారిని విరాజిల్లునట్లు చేసెదవు కదా. సౌజన్యమూర్తులయిన పాలకులను 

చక్కగా కాపాడుచూ నిలుపుము తల్లీ! మా జీవనమున ముఖ్యమయిన 

ఫలమయిన ఓ తల్లీ! నాజీవితాంతమునునిన్ను పూజించనిమ్ము!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.