గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

శ్రీ వసంతతిలక సూర్యశతకము 86 నుండి 90 వరకు... రచన చింతా రామకృష్ణారావు.... గానం శ్రీమతి సిశీలాదేవి.బీ.

 జైశ్రీరామ్.

86. సంతోషమిచ్చునది సద్గుణమే తలంపన్. 

శాంతాత్మయున్ సతము సంతస మందఁజేయున్.

శాంతాత్మనిమ్ము మనసారగ నాకికన్. నే 

చింతాన్వయున్. గనుమ చిన్మయ సూర్యదేవా!

 

87. సాయాహ్నమున్ హరివి చక్కఁగ కావ మమ్మున్. 

నీయందు చూచెదము నిత్యుని దేవదేవున్.

ధ్యేయంబు కొల్పుము మహేశ్వర మాకు నీవే 

సాయంబు కమ్ము కొనసాగఁగ సూర్యదేవా!

 

88. జాగ్రత్ప్రదాతవు ప్రశస్తిగ నిల్పునాలో 

నుగ్రత్వమున్ తుడిచి యోగ్య సుశౌచ్యమిమ్మా.

అగ్రేసరుండవయి హాయిగ చూపు దారిన్. 

సుగ్రాహ్యమౌసుగతి చూపుమ సూర్యదేవా!

 

89. నింగిం జరించుటయె నీకు సుఖంబదేలో?  

పొంగారు కాంతుల సముద్ధత యేల నీకున్

భంగంబెఱుంగకయె పర్విడు భద్రతేజా!  

బెంగల్ విడన్ గనుమ విశ్వభ! సూర్యదేవా!  

 

90. హే హేమమాలి! ప్రవహించగ భక్తి మాలో 

మోహాదులున్ దొలగి ముక్తికి చేరువైనన్

స్నేహంబుతోఁ దరికి చేరుదుమయ్య నీకున్. 

నీ హస్తమిచ్చి కరుణించుమ సూర్యదేవా!  

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.