గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

శ్రీ వసంతతిలక సూర్యశతకము 81 నుండి 85 వరకు... రచన చింతా రామకృష్ణారావు.... గానం శ్రీమతి సిశీలాదేవి.బీ.

 జైశ్రీరామ్.

81. పాదాభివందనము భక్తిగ చేయు వారిన్ 

మోదంబుతో గనుచు పూజ్యతఁ గొల్పు వాఁడా! 

నీ దారిలో నడుచు నిర్మల తత్త్వమిమ్మా. 

బోధన్ మదిం గొలిపి, ప్రోచెడి సూర్యదేవా!

 

82. బ్రహ్మజ్ఞులన్ కృపను వర్ధిలఁ జేయుదీవే.  

బహ్మైక్య మార్గమును భాసిలఁ గొల్పు మాకున్.

బ్రహ్మంబు నీవె కద పండితపాళి మిత్రా!   

బ్రహ్మస్వరూప! గుణ భాసిత సూర్యదేవా!  

 

83. సంసారసాగరము చక్కఁగ దాటఁజేయన్

హింసావిదూరునిగనెల్లరినెన్ని ప్రోవన్,

కంసారికైననిల కావలె నిక్కమీవే. 

హంసాకృతిన్ వెలుగుమా మది సూర్యదేవా!  

 

84. ఛాయాసతీ సహిత! సారస వృత్త వర్తీ!  

మాయావిమోహములు మమ్ముల వీడిపోవన్

చేయంగ నీకు తగు. చేయుము ధ్వాంతహారీ!  

శ్రేయంబులే కలుగఁజేసెడి సూర్యదేవా!  

 

85. ఉగ్రాకృతిన్ గని మహోగ్రుల, సంహరింపన్ 

వాగ్రూప సత్ కృతిగ భవ్యుఁడ! వెల్గుమయ్యా!

అగ్రేసరుండవయి హారతులందుమయ్యా!  

వ్యగ్రుండ. వ్యగ్రతను బాపుము సూర్యదేవా!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.