గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

శ్రీ వసంతతిలక సూర్యశతకము 71 నుండి 75 వరకు... రచన చింతా రామకృష్ణారావు.... గానం శ్రీమతి సిశీలాదేవి.బీ.

 జైశ్రీరామ్.

71. నీ రాకచే దిశలనేకము వెల్గుచూచున్.  

నీరాకరంబునను నీరజ పాళి పొంగున్.

ధారాళమౌ వర సుధారస దాన శీలా!  

వారింపుమా దురితపాళిని సూర్యదేవా!

 

72. ఆకాశమందున నహర్నిశ లెట్లు మిత్రా!  

యేకాగ్రతన్ తిరుగుదీవు? మహాద్భుతంబే.

నీకెన్నగా విరతి నిర్మల! లేదదేలో?  

మాకై చరింతువు సమస్తము సూర్యదేవా!

 

73. నా భావనాంబర మునన్ తగు వెల్గు నింపే  

నీ భావనన్ తిరుగు నిర్మల చిద్వివృద్ధా! 

స్వాభావికమ్మగుత శాంతము నాకు. నీవే  

నా భావనన్ వెలుఁగు నా ప్రియ సూర్యదేవా! 

 

74. తేజమ్ముకల్గు గుణధీరుల, ధీరలందున్  

స్త్రీ జాతిలోన్ వెలుగు చిందెడిశక్తి వీవే ,

నీ జీవనంబె మహనీయులమార్గమెన్నన్.  

నా జీవ శక్తివి. సనాతన సూర్యదేవా!

 

75. పూర్ణాకృతిన్ వెలుఁగు పూజ్యుఁడవీవు చూడన్.  

కర్ణామృతంబు శుభ కారక నీదు గాధల్.

స్వర్ణంబు కూడ భువి చాలదు పోల నిన్నున్. 

దుర్నాథులన్ తొలఁగఁ ద్రోలుము సూర్యదేవా

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.