గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

శ్రీ వసంతతిలక సూర్యశతకము 61 నుండి 65 వరకు... రచన చింతా రామకృష్ణారావు.... గానం శ్రీమతి సిశీలాదేవి.బీ.

 జైశ్రీరామ్.

61. దేదీప్యమాన వర తేజమునొప్పు వాఁడా! 

మోదంబుఁగూర్చఁగను బుద్ధిని గొల్పరావా?

నీ దివ్య భాతి మహనీయతఁ గొల్పుఁ గాదే. 

ఆదిత్యనామ పరమాత్ముఁడ సూర్యదేవా!

 

62. శ్రీ భారతాంబనలరించు శుభాళి. ఎన్నన్ 

మా భాగ్యమీ జనని మాకు లభించుటెల్లన్.

శోభాయమానముగ చూడుము నీవు మమ్మున్. 

శ్రీ భాస్కరా! సుగుణశేఖర సూర్యదేవా!  

 

63. నిత్యప్రదీప! కరుణించుము నిర్వికల్పా!  

సత్యంబు, నీ కృపనె సర్వము వెల్గుచుండున్.

స్తుత్యంబు నీ గమన ధుర్యత హే సుధీ! యా 

దిత్యాఖ్య! వందనము తెల్పెద సూర్యదేవా!  

 

64. స్వర్ణంబు పోలెడి యసాదృశ వర్ణభాతిన్. 

వర్ణంబులొక్కటిగ భాసిలునేడు నీలోన్.

పర్ణంబులాదిగ ప్రపంచము వ్యాప్తి చెందెన్. 

పూర్ణాకృతిన్వెలుఁగు పూజ్యుఁడ సూర్యదేవా!  

 

65. పాపాత్ములన్ దునిమి భక్తులఁ గావ రావా. 

నీ పాదముల్మదిని నిత్యము నిల్పువారిన్

కాపాడు ధర్మమది కాంచవొ నీదటంచున్

మా పాపహారివగు మాన్యుఁడ! సూర్యదేవా!  

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.