గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 51వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

51. కర్ణామృతంబయిన స్వర్ణాక్షరాళినిడి వర్ణింతు నీదు ఘనతన్,

పూర్ణ స్వరూపిణివి పూర్ణేందు భాసవి యపర్ణా! కృపం గనుమికన్.. 

దుర్నీతులన్ దునుము పర్ణంబులట్లురల, స్వర్ణాక్షరీ కొలుతు నిన్, 

కర్ణంబులుల్లసిల వర్ణింపనిమ్ము నిను స్వర్ణప్రదా! వర సతీ! 

భావము.

సువర్ణప్రదవయి శ్రేష్టురాలివయిన ఓ సతీ మాతా! వినసొంపుగా ఉండు 

సువర్ణమయమగు అక్షరములతో నీ యొక్క ఘనతను వర్ణించెదను తల్లీ! 

ఓ అపర్ణా! నీవు పరిపూర్ణ స్వరూపము కలదానివి. పూర్ణిమ చంద్రునివలె 

ప్రకాశించు తల్లివి. ఓ స్వర్ణాక్షరీ నిన్ను కొలిచెదను. నన్ను కృపతో 

చూడుమమ్మా. అవినీతిగా ప్రవర్తించువారిని ఆకులవలె రాలిపోవునట్లు 

సంహరింపుము. కర్ణాంఋతముగా నిన్ను వర్ణింపనిమ్ము తల్లీ.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.