గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 50వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

50. ఏనాటి పుణ్య ఫల మీనాడు కల్గుటిది శ్రీనిర్మలాత్మవు నినున్ 

జ్ఞానాక్షితోఁ గను టదే నాకు భోగమగు, నా నీడవై నిలుచుచున్

ప్రాణంబు నీవయి ప్రమాణంబుగా నిలిపి రాణింపఁ జేయు మిలలో

హే నా జగజ్జనని నేనున్ నినుం దలతుఁ గానం గనం దగు సతీ! 

భావము.

ఓ సతీ మాతా! నీవు నాకు సమీపములో నిలిచితివా? ఆహా! ఇది నాకు ఏ నాటి 

పుణ్యఫలమో కదా, ఈసమయమున నాకులభించినది.  మంగళప్రదమయిన  

నిర్మల మనస్సు గలతల్లివి.  అటువంటి నిన్ను నా జ్ఞాన నేత్రముతో చూడఁ 

గలుగుటనాకు లభించిన భోగమేయగునమ్మా. నానీడవై నీవు నిలుచుచు నా  

ప్రాణమే నీవగుచు నన్ను ప్రమాణముగా నిలుపుమమ్మా. ఓ నా లోకమాతా! 

నేను నిన్ను మనసులో నిత్యమూ తలంతునుంఇన్ను చూచు విధముగా 

నన్ను అనుగ్రహముతో చూచుట నీకు తగునమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.