గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 52వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

52. జాలిన్ సుధీవరు కపాలిన్ వరించితివి, నీ లీలలెన్నఁ దరమా. 

యే లీల నీవతని పాలిం మెలంగెదవొ లోలాక్షిరో తెలుపుమా.

చేలాంచలంబతని నీలీల నిల్పినద? నీలాలకల్ మహిమమా? 

పాలింతువెల్లరిని జాలిం కనంబరిచి హేలన్. సుశోభిల, సతీ! 

భావము.

ఓ సతీ మాతా! శ్రేష్టమయిన బుద్ధితో నొప్పెడి కపాలిని నీవు జాలిపడి 

వరించితివి. నీ లీలలనెన్నుట సాధ్యమగునా తల్లీ!  చంచల నేత్రములతో 

సుందరమైన ఓ తల్లీ! నీ పతి విషయమున నీవు ఏ విధముగా ప్రవర్తింతువో 

మాకు తెలియఁజేయుమమ్మా. నీ కడకొంగు ఆ శివుని ఈ విధముగా నీ 

విషయమున నిలిపివేసినదా? నీ నల్లని ముంగురుల మాహాత్మ్యమా? నీవు 

జాలి చూపించుచు అందరినీ గొప్పగా శోభిల్లు విధముగా పరిపాలింతువు కదా 

తల్లీ!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.