గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

శ్రీ వసంతతిలక సూర్యశతకము 46 నుండి 50 వరకు... రచన చింతా రామకృష్ణారావు.... గానం శ్రీమతి సిశీలాదేవి.బీ.

 జైశ్రీరామ్.

46. ప్రత్యక్ష దైవమని ప్రార్థన చేయువారల్ 

నిత్యుండ! నిన్ను కరుణింపఁగ కోరువారే.

స్తుత్యుండ! పూజ్య గుణ    శోభితులైన వారిన్ 

నిత్యంబు కావగదె నేర్పున సూర్యదేవా!

 
47. దివ్యాంగులన్ కనుమ దీన జనార్తహారీ! 

భవ్యాత్ము లాదుకొన, వారికి మేలు కల్గున్.

సవ్యంబుగా బ్రతుకు సాగఁగఁ జేయుమయ్యా! 

నవ్యంబుకాన్ సతమనంతుఁడ! సూర్యదేవా!  

48. గోరంత దీపశిఖ కూర్చఁగ జ్ఞాన దీప్తిన్ 

నీరాక కొల్పెడి వినిర్మల శక్తి యెంతో?

శ్రీ రాఘవుండె మది చింతన చేసి నిన్నున్ 

కోరెన్ శుభంబులను కొల్పఁగ సూర్యదేవా!                                                                                      
                                                                                                                                          

49. నిస్సారమౌ జగతి నిత్యమటంచు మూర్ఖుల్ 

దుస్సాధమున్ జరుపు ధోరణినుందురేలో.

నిస్సంశయంబుగ వినిర్జన చేయరావా. 

దుస్సాంద్రులన్, కలివిదూరుఁడ! సూర్యదేవా! . 


50. మానాభిమానములు మాకిల పెంచుమెమ్మిన్. 

ప్రాణప్రదంబుగ నిరంతర మేలు మమ్మున్

జ్ఞానాక్షయాంచిత వికాసము గొల్పు మాలోన్ 

నీ నా విభేదము గణింపక సూర్యదేవా! 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.