జైశ్రీరామ్.
41. హే సూర్య! పుట్టితివదెప్పుడు? తెల్పుమయ్యా!
భాసింతు వేపగిది భాస్కర నేర్పుమీరన్?
పోషింతువీవెయని పూజ్యుల వాక్కులయ్యా!
నా సన్నుతుల్ గొనుమనంతుఁడ! సూర్యదేవా!
42. నూత్నోదయంబుల వినూతన తేజమెంచన్
రత్నాకరుండును నిరంతరమెంచు నిన్నే.
పత్నీసమేతులును, భక్తులు వార్త్రు నీకై.
నూత్నత్వమిమ్ము. సుమనోహర! సూర్య దేవా!
43. రాగోదయంబవ,
వరంబుగ వత్తువయ్యా
బాగోగులన్ గనఁగ భక్తుల కీవు దేవా!
యాగాదులన్ నిను నహంబులఁ గొల్తురయ్యా.
యోగంబు నీవె శుభయోగద! సూర్య దేవా!
44. నీ భాతిఁ గాంచఁగనె నేర్పున భక్తితోడన్ -
శోభింపఁ జేయఁగను సూర్య నమస్కృతంబుల్
మా భాగ్యమంచు నిను మన్ననఁ జేయువారిన్
శోభాకరా! కనుమ శోభిల సూర్య దేవా!
45. నీకున్న శక్తిఁ గననేర్తురు సత్కవీంద్రుల్. -
మాకున్న శక్తివి సమస్తము నీవె చూడన్.
నీకన్న దైవమును నేను కనంగ నేరన్.
లోకంబునే కను సులోచన సూర్య దేవా!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.