గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

శ్రీ వసంతతిలక సూర్యశతకము 36 నుండి 40 వరకు... రచన చింతా రామకృష్ణారావు.... గానం శ్రీమతి సిశీలాదేవి.బీ.

జైశ్రీరామ్.
36. సూర్యుండ. నీకృపయె చూడఁగఁ జేయునెల్లన్.  
సౌర్యంబు నీ కళయె సత్యము కాంతిపూర్ణా! 
కార్యార్థులెన్నుదురు గౌరవమొప్ప నిన్నున్.  
ధుర్యుండ! నే కొలుచుదున్ కను సూర్యదేవా!

37. మిత్రుండనన్ రవియు మిత్రుఁడు గాన నిన్నున్  
మిత్రుండుగా తలచ మేలుగనుండి యొప్పున్.
పాత్రుండ నన్నెలమి వర్థిలఁ జేయుమయ్యా!  
స్తోత్రంబు చేసెద వసుంధర సూర్యదేవా!

38. అజ్ఞాన శర్వరమునంతము చేయుదీవే.  
విజ్ఞాన తేజమును వింతగ గొల్పుదీవే.
ప్రజ్ఞాప్రభావమును వాసిగ చూపుదీవే. 
సుజ్ఞానమీయగను చూడుము.సూర్యదేవా!

39. వాసించు ధీవరుల ప్రాభవ వర్తనంబుల్ 

శేషాహియున్ వినుతి చేయగ చాలఁడయ్యా.

సృష్టికన్నిటికినీవెగ సాక్షివెన్నన్. 

నీ సాక్షిగా కలరనేకులు సూర్య దేవా!
                        

40. లోకేశ్వరా జగతిలో దురపిల్లువారల్  

నీకంటిలో పడరొ? నీ మది క్రుంగిపోదో.

చీకాకులన్ దొలఁగఁజేయఁగ బుద్ధి పోదో. 

నీ కంట గాంచి మననీయుము సూర్యదేవా!

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.