గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).35వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

  జైశ్రీరామ్. 

35. శ్రీమన్మహాభవుని ప్రేమార్ణవంబుఁ గొని శ్రీమాతవై వెలుఁగు నీ 

ధీమంతుఁడౌ సఖుని నే మానసంబునను ప్రేమన్ సదా కొలిచెదన్. 

నీమంబుతో శతక ధామంబునే కొలిపి ప్రేమన్ నినున్ నిలిపెదన్. 

నీ మానసంబుఁ గని ప్రేమన్ రచించెదను శ్రీమాత నీ కృప, సతీ! 

భావము.

ఓ సతీ మాతా! మంగళ కరుఁడగు మహేశ్వరుని ప్రేమ సముద్రమును పొంది 

శ్రీమాతగా వెలుఁగుచుంటివా తల్లీ? జ్ఞానమూర్తి యయిన నీ సఖుఁడయిన ఆ 

పరమేశ్వరుని నేను నా మనసులో ప్రేమతో సేవింతునమ్మా! నియమముతో 

శతకమనెడి గృహమును నిర్మించి, ప్రేమతో ఆ గృహమున నిన్ను నివసింపఁ 

జేయుదును. నీ హృదయమును గ్రహించి, నీ యొక్క కృపను గూర్చి ప్రేమతో 

రచించుదును తల్లీ!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.