గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).36వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

  జైశ్రీరామ్. 

36. భద్రేభ గామిని! సుభద్రాక్షయాక్షర సముద్రమ్మునన్ మధువువై 

నిద్రించు నా మదిని భద్రంబుగా వెలిగి ముద్రింతు వీవు సుకృతిన్. 

క్షుద్రాళినే యణచి సద్రక్షణన్ గొలుప నుద్రేక మొప్పు కవితన్ 

మద్రమ్య సద్రచన సద్రక్షణీ! కొలుపు భద్రమ్ము కాగను, సతీ!

భావము.

మత్తేభము నడకవంటి నడక కలిగిన ఓ సతీ మాతా! మిక్కిలి భద్రత నిడెడి 

అంతులేని అక్షర సముద్రమున అమృత స్వరూపమై నిద్రావస్థలో 

నున్న నా మనస్సులో క్షేమప్రదవై  ప్రకాశించుచు హృదయమున 

మంగళమును ముద్రించుదువు కదా. లోకమున క్షుద్రులను అణచి వేసి, 

లోకక్షేమము కొలుపుట కొఱకు మంచికి రక్షణ కలుఁగఁ జేయుట కొఱకు ఉద్రేక 

పూరిత యిన కవితను నాయొక్క రమ్యమయిన మంచి రచనలో 

కొలుపుమమ్మా.!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.