గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).34వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

  జైశ్రీరామ్. 

34. కాయంబశాశ్వతము. కాయంబు లేని తరి మాయన్ విడన్ సులభమౌన్. 

నీయందె నమ్మకము కాయంగనుంటివని కాయంగ రమ్ము పతితోన్. 

నీ యానతే సతము నాయందు శక్తినిడు న్యాయంబునే నడుపగా. 

మాయా జగంబున నమేయప్రభన్ నిలుతు నీ యానతిన్ గని సతీ! 

భావము.

ఓ సతీ మాతా! ఈ శరీరము శాశ్వతమయినది కాదు. అటువంటి యీ 

శరీరము లేకపోయినచో మాయను విడనాడుట సులభమగును. మమ్ములను 

కాపాడుటకు నీ వుంటివని నీపైననే నాకు విశ్వాసము. నీవు పతితో కూడి 

మమ్ములను కాపాడుటకు రమ్ము. న్యాయమును పాటించుటకు నీ యొక్క 

అనుజ్ఞయే నాలో శక్తిని సమకూర్చును తల్లీ! నీ ఆనతితో ఈ మాయా 

ప్రపంచములో అంతులేని ప్రకాశముతో నిలిచెదనమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.