గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).33వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

జైశ్రీరామ్. 

33. ఏలో సృజించితివి నీలాంబరంబచట నేలో మమున్ భగవతీ? 

ఏలన్ మమున్ మరచి తేలో గృపన్ గనక మేలమ్మొ నీ కనుపమా! 

ఏలేటి తల్లివని నేలన్ జనుల్ గనుదు రేలా మదిన్ కనవో? హే 

బాలేందువక్త్ర పరిపాలింపుమమ్మ మము నీలాలకాక్షర! సతీ!  

భావము.

సాటి లేని ఓ సతీ మాతా! నల్లని ముంగురులుగలదానా?  ఓ భగవతీ! 

అచ్చట నీలాకాశమును, ఇచ్చట భూమిపై మమ్ములను ఎందులకు 

సృష్టించితివో? ఓ సాటిలేని తల్లీ! ఎందుచేత కృపతో కనుట యెందులకో 

మాని, మమ్ములను పలించుటను మరచితివి? నీకిది పరిహాసమా తల్లీ? 

పాలించే తల్లివనుచు భూజనులు భావించుచుందురు. నీవేల వారిని చూడవు? 

చంద్రరేఖను ధరించిన ముఖము కల తల్లీ! మమ్ములను పరిపాలించుమమ్మా.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.