గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).20వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

20.  ఓంకార రూపిణివి యోంకార భాసినివి యోంకార భూషిణివిగా.

ఓంకారమున్ గనుదు నోంకారమైన నిను, నోంకార వర్తివగుటన్

ఓంకారమే తమకు సంకేతమమ్మ గన నోంకార పూర్ణవు కదా.

ఓంకార తేజము నహంకారమే తొలఁగు నింకేల నా కిడు సతీ..

భావము

ఓ సతీమాతా! ఓంకారము యొక్క తేజస్సు కారణంగా మా లోని

అహంకారమన్నది తొలఁగిపోవునమ్మా.  ఇక ఆలస్యమెందులకు? ఆ ఓంకార

తేజస్సును నాకు ప్రసాదించుమమ్మా,  నీవు ఓంకార స్వరూపిణివి.

ఓంకారమునందు భాసిల్లు తల్లివి, ఓంకారముచే అలంకరింపబడిన అమ్మవు

కదా. నీవు ఓంకారమునందు సంచరించుచ్గుందువుగాన  ఓంకార

స్వరూపిణివైన నిన్ను ఓంకారమునందు చూచుదునమ్మా.

తమకు ఓంకారమే సంకేతముకదా తల్లీ. చూడగా ఓంకారపూర్ణస్వరూపిణివి

నీవే నమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.