గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).21వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

జైశ్రీరామ్.

21. దైవాంశ లేక నిను భావింపనెట్టులగు? దేవీ మదాత్మ నిలయా! 

జీవాత్మవీవగుచు జీవించువారిఁ గని భావింతు నిన్ సుజనులన్ 

సేవాపరత్వమున నీవే ప్రభాసిలఁగ నీవౌచు నా ఘనులుగా 

శ్రీవాణి సత్ కృపను భావించి పద్యములు నీవే రచింతువు సతీ!. 

భావము.

నా ఆత్మయే  నిలయముగా కలిగియున్న ఓ సతీమాతా! ఓ దేవీ! మాలో 

దైవాంశ లేనిచో నిన్ను చూచ్ట ఎట్లు సాధ్యపడునమ్మా. నీవే జీవాత్మగా 

ఉండిన కారణముగా సుజనులై జీవించేవారిని చూచి వారిలో నేను నిన్నే 

భావింతునమ్మా.  సేవయే పరమార్థముగా కలిగిన కారణము చేత నీవే 

ప్రకాశించుచుండుట కొఱకు ఆఘనులుగా నీవే యగుచు, వారిని నేను 

చూచినతోడనే శ్రీశారదామాతకు నాపై ఉన్న మంచి కృపను భావించి నీవే 

నాలోనుండి పద్యములు  రచించుచుందువుకదా తల్లీ! 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.