గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).14వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్

14. ఆశావహుల్ జగతి నాశంబు చేయుదురు, నీ శక్తితో నిలుపుమా. 

దేశాధినాథులు దురాశాపరుల్ కలరు, దేశంబె నాశనమగున్. 

కాశీపురంధ్రివి, ప్రకాశంబు నిల్పు మిక దేశ ప్రభన్ నిలుపుమా, 

హేశాంభవీ! జనని! హే శక్తి రూపిణి! మహేశాని! ధీవర సతీ!

భావము.

ఓభవానీ! ఓ అమ్మా! ఓ శక్తిరూపిణీ! ఓ మహేశ్వరీ!శ్రేష్టమయిన 

జ్ఞానపూర్ణవయిన సతీ మాతా! లోకమున ఆశాపరులు ఉండిరి వారి లోకమునే 

నాశనము చేయుదురమ్మా. నీ శక్తి చూపి వారిని నిలువరింపుము 

తల్లీ!దేశాధ్నాథులలో కూడా ఆశాపరులు ఉండిరమ్మా. వారి వలన దేశమే 

నాశనమగును తల్లీ! ఓ కాశీపురాధీశ్వరీ! దేశప్రకాశమును నిలుపుమమ్మా. 

దేశమునకున్న వైభవమును తగ్గనీయకుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.