గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).13వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

13. దోసంబులెన్నకుమ, భాసించు మంచిఁ గని, ధ్యాసన్ ననున్ నిలుపుమా. 

నా సేవలం గొనుమ నా సత్కృతిన్ గనుమ భాసింపఁ జేయుమ కృతిన్. 

మోసంబులన్ బడక నీ సేవలన్ మనఁగ నాసింతు నేను జననీ, 

ధీసద్గుణంబులిడి నీ సన్నిధిన్ మదిని నిత్యంబు నిల్పుము సతీ!

భావము.

ఓ సతీమాతా! దోషములను పరిగణింపవలదు. మలో ప్రకాశించెడి మంచిని 

గుర్తించుము. నన్ను ధ్యాసతో నిలఁబెట్టుము. నా సేవలను స్వీకరించుము. నా 

యొక్క సత్ కృతిని చూడుము. నా యొక్క ఈ రచనను వెలుగులీనునట్లు 

చేయుము. ఓ జననీ! ఏవిధమయిన మోసములకు తావు కాకుండా, నీ సేవలతో 

బ్రతుకు సాగదీయుచు జీవించవలెనని నేను కోరుకొంద్సును. బుద్ధి మంచి 

గుణములు ఒసగి, నీ సన్నిధిలోనే నిత్యమూమనసు నిత్యమూ 

ఉండునట్లు చేయుమమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.