గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).12వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

12. లోకంబులో కృతులనేకంబులున్న విక నీకేల చింత యన కో

లోకేశ్వరీ కృతులు నీకై రచింపగను నాకిమ్ము శక్తి కృపతో,

నీకై రచింపగను లేకున్నచో బ్రతుకు నాకేలనమ్మ భువిపై,

చీకాకులన్ బడక నీకై రచించుటది నాకిచ్చు ముక్తిని సతీ!

భావము.

ఓ  సతీమాతా! ఈ లోకములోనాపై రచింపబడిన రచనలు అనేకము ఉన్నవి

కదా, నీకింక చింత ఎందుకు అనకుండా ఓ లోకమాతా నీపై క్ఉతులు

వ్రాయుట కొఱకు కృపతో నకు శక్తినొసగుముంఈపై కృతి రచింపలేనినాడు

భూమిపై నాకీ బ్రతుకు వ్యర్థమే కదా. చికాకు పడకుండా నీ కొఱకు రచనలు 

చేయుట అనునది నాకు ముక్తినొసగును సుమా.  

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.