గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).11వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

11. వేదాంత సారమ, ప్రమోదంబుతో కనుమ. పేద ప్రజన్ నిరతమున్.

కాదన్నచో ప్రజల కేదున్నదింక తరి సాదంబుకే కరువగున్. 

నీ దివ్య సత్ కరుణనే దారిగాఁ దలచి మోదంబుతోఁ గొలుతురే 

బాధావహంబు కద మోదంబుతోఁ గనమి నేదారి కానరు సతీ! 

భావము.

ఓ వేదాంత సారమా! సతీ మాతా! మొక్కిలి ఇష్టముతో పేదప్రజలను 

యెల్లప్పుడూ చూడుమమ్మా! నీవు కాదు అని అన్నచో ఇంక ప్రజలకు ఉన్న 

మార్గమేమిటమ్మా? తిండికే కరువు అగునుకదా తల్లీ! నీ యొక్క గొప్పదయిన 

మంచి కరుణయే మార్గముగా భావించి, చాలా యిష్టముతో నిన్ను 

సేవించుదురు కదా, నీవు మోదముచో కనకున్నచో బాధకు స్థానమయి ఏ 

మార్గము లేనివారగుదురుకద్సా అమ్మా!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.