జైశ్రీరామ్.
10. విశ్రాంతి బోధకుఁడ, విశ్రాంతి కోరని యవిశ్రాంత సేవకుఁడ నీ
సుశ్రావ్య సత్ కృతులు సుశ్రేయమున్ గొలుపఁగా శ్రద్ధతో నొనరుతున్.
ధీశ్రీ భవత్ కరుణ సుశ్రోతలందునను సుశ్రావ్య గాన గరిమన్
సుశ్రీలిడన్ నిలిపి విశ్రాంతిగాఁ గొలిపి శుశ్రూష నందుము సతీ!
భావము.
ఓ సతీమాతా! నేను విశ్రాంత కళాశాల ఉపన్యాసకుడను.
వీశ్రాంతి కోరని
అవిశ్రాంత సేవకుడను. నీకు సంబంధించునట్టి చక్కగా
విన దగిన మంచి
రచనలు మంచి లోకక్షేమమును కలుగజేయు విధముగా
శ్రద్ధతో
చేయుదునమ్మా. నాకు సంప్రాప్తించిన జ్ఞానలక్ష్మి
యనునది
నీకృపాలబ్ధము. మంచిశ్రోతలలో నన్ను మంచి పాడేగొప్పదనముతో
మంచి కలుగ జేయునట్లు నిలిపి, విశ్రాంతిగా ప్రశాంతిని
కలుగజేసి,నా
సేవలనందుమమ్మా.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.