గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 79వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

79. శ్రీమార్గమున్ గొలుప క్షేమంబుఁ గొల్పగను నీ మానసంబు నిలదో.

నా మార్గమీవగుచు నామీద లేదొ కృప శ్రీమాతరో తెలుపుమా.

యో మాత నీవె తగు ప్రేమామృతంబిడిన క్షేమంబె నాకుఁ గలుగున్.

స్త్రీమూర్తులందొదిగి ప్రేమన్ గనంబరచు మామాత వీవెగ సతీ!

భావము.

ఓ సతీ మాతా! నాకు మంగళప్రదమయిన మార్గము కలిగించుట యందును, 

క్షేమమును కలిగించుటయందును నీకు మనసు నిలవదా తల్లీ! నా మార్గము 

నీవే అయియుండియును నాపై కృప లేకపోయెనా?ఓ శ్రీమాతా! 

నాకెఱిగింపుము.ఓ జననీ! నీవే నాకు తగిన ప్రేమామృత మొసంగినచో నాకు 

మంచియే జరుగునమ్మా. స్త్రీస్వరూపులందు నీవు ఒదిగి యుండి నాపై 

మాతృప్రేమను చూపెడి నా తల్లివి నీవేకదా జననీ!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.