జైశ్రీరామ్.
55. రాత్రించరుల్ దురిత పాత్రుల్ దురాత్ములయి,ధాత్రిన్ వినాశనము కాన్
చిత్రంబుగా కనిన మాత్రంబునన్ గొలుపు మైత్రిన్ ప్రవర్తనము చేన్.
మిత్రుండవీవయను చాత్రంబునన్ గనరె శత్రుత్వమున్ నెరపుచున్.
మా త్రాత వీవగుచు ధాత్రిన్ మమున్ గనుమ. శత్రుఘ్న పావన సతీ!
భావము.
శతృవిధ్వంసము చేసెడి పావనవయిన ఓ సతీ మాతా! మాయ అనే చీకటిలో
సంచరించేవారు చెడుకు పాత్రులు గా దురాత్ములుగాను అయి ఈ భూమినే
నాశనమగునట్లువిధముగా, తమ ప్రవర్తనచేత మిక్కుటమగు
ఆశ్చర్యకరముగా ఇతరులతో స్నేహము ప్రకటించుచు నీవు
నామిత్రుఁడవు అని పలుకుచు మోసము చేయుచు శత్రువులు
ప్రవర్తించుదురు. మారక్షకురాలివగుచు అట్టి దుర్మార్గులనుండి మమ్ము
కాపాడుమమ్మా.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.