గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 54వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

54. నీలాలకా! సుగుణ పాలా! త్రిలోక పరిపాలా త్రిశూలధర నీ  

వేలీల రక్షింతువేలీల సిద్ధింతు వేలీల నన్ నిలుపుదో.

కాలాత్మవీవెకద కేళిన్ రచింతువిల నీలీలలివ్వె కనగా

జాలిన్ ననున్ మహిమనేలన్ గదమ్మ, కను హేలన్, శుభాకర సతీ!

భావము.

శుభములకు స్థానమయిన ఓ సతీ మాతా! నల్లని ముంగురులు కల ఓ 

జననీ!మంచివారిని పరిపాలించు తల్లీ! ముల్లోకములనూ పాలించు 

త్రిశూలధారివయిన అమ్మా!నీవు నన్ను ఏ విధముగా రక్షించుదువో, నాకు ఏ 

విధముగా సిద్ధింతువో, నన్ను ఏ విధముగా నిలుపుదువో? కాలమునందలి 

ఆత్మవు నీవేకదా తల్లీ. ఈ భూమిని ఆటగా రచించుదువుకదా అమ్మా. చూడగా 

ఇవన్నియు నీ లీలలు.నాపై జాలితో నీ మాహాత్మ్యము చూపి 

పాలింపదగునుకదా తల్లీ! నన్ను హేలగా కనుచూ రక్షించుచుండుమమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.