గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 44వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

44. సాహిత్యమున్ మిగుల సౌహార్ద్రమున్ గలుగు దేహంబునన్ నిను గనన్ 

స్నేహోన్నతిన్ గలుగు సౌహార్ద్ర చిత్తుల కిదే హారతిన్ గొలిచెదన్.

నీ హస్తమే యిచట నా హస్తమున్ గొనుచు స్నేహోన్నతిన్ కవితతో 

నాహా యనన్ దెలియ మోహార్తి బాపుఁ గద సౌహార్ద్రతన్ గను సతీ! 

భావము.

సహృదయంతో చూచెడి ఓ సతీ మాతా! నిన్ను దేహమున చూచుచున్నచో

సాహిత్యమును, అధికమయిన సౌహార్దమును తప్పక కలుగును తల్లీ. 

ఉన్నతమయిన స్నేహ భావము ఉన్న సౌహార్దమనసులకిదే హారతి పట్టి 

సేవించుదునమ్మా,. నీ యొక్క  యీ చేయియే స్వయముగా నా చేతికి 

ఆలంబన మగుచు స్వీకరించి స్నేహాధిక్యముతో ఆహా యని ఆశ్చర్య 

పోవుచు గ్రహించునట్లుగా కవిత వెలయించి దానితో మా మోహార్తిని పోగొట్టును 

కదా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.