గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 43వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

43. కన్నార నిన్నుఁ గన నెన్నన్,  గనన్ జనమి నెన్నన్ గ నా కనులిలన్ 

మున్నుంచుమా జనని మన్నున్, నినున్ గనుదు, నిన్నున్ గనం గొలుపుమా.

పున్నెంబుచే కనెడు కన్నున్ గనం గనుదు మున్నున్న నిన్ను జననీ.

నన్నేలుమా జనని కన్నార జూతు నిను నన్నేలు దీప్తివి సతీ! 

భావము.

ఓ సతీ మాతా! ఆలోచించినచో ఈ భూమిపై నా కన్నులు కనులారా నిన్ను 

చూడఁ దలచి చూడలేకపోయినచో నీవున్న మట్టి రూపమునయినను 

నాకనులముందుంచుమమ్మా. నిన్ను ఆ విధముగనయినను 

చూచుదును నిన్ను చూచునట్లు చేయుమమ్మా. ఓ తల్లీ! నా కనులముందే 

ఉన్న నిన్ను పుణ్య ఫలముచే చూచెడి జ్ఞాన నేత్రముతో నిన్ను 

చూచుదునమ్మా. నీవు నన్నేలెడి కాంతివే. నన్నేలే నా తల్లివగు నిన్ను 

కనులారా చూచుదునమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.