గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).39వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్. 

39. క్షేత్రంబు నీవె కన క్షేత్రజ్ఞవీవె కన, క్షేత్రార్థ మీవె కనఁగా.

గోత్రంబులేల నిల పాత్రంబు లేల శుభ ధాత్రిన్ నినున్ గలిగినన్. 

సూత్రంబు నీవె కన గోత్రంబు నీవె గుణ పాత్రంబు నీవె కనఁగా. 

గోత్రార్థమీవెగ. పవిత్రార్థమీవెగ. మహత్త్రాత వీవెగ సతీ!

భావము.

ఓ సతీ మాతా! ఈ శరీరము నీవే.  ఈ శరీరమున తెలియఁబడు దానవూ 

నీవేనమ్మా. క్షేత్రార్థమందువా…. అదియూ నీవే. ఈ శుభప్రదమయిన 

భారత  ధరిత్రిపై నీవే మకు కలిగి యున్నచో మా యొక్క 

గోత్రములతో పనియేమున్నదమ్మా? మా పాత్రలతో పని యేమి కలదు? 

మేము చెప్పుకొనెడి గోత్రములు నీవే, సూత్రములు కూడా నీవే నమ్మా. 

గోత్రార్థము కూడా నీవే కదా. మమ్ములను గొప్పగా రక్షించు తల్లివీ నీవేకదా 

మాతా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.