గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).27వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

  జైశ్రీరామ్. 

27. నీ దివ్య తత్వమును సాధుస్వభావమును బోధన్ గనన్ గొలుపుమా, 

శోధించి చూచినను నీ దీప్తి యన్యులను లేదన్నదే నిజముగా. 

మాధుర్య భావము ప్రమోదంపు జీవనము నీ దీవనన్ గలుఁగుగా, 

హే దీన బాంధవి! ప్రమాదంబులన్ దుడిచి యీదీను గావుము  సతీ. 

భావము.

ఓ సతీమాతా! నీ యొక్క గొప్ప తత్వమును, నీ సాధుస్వభావమును, జ్ఞానము 

పొంది చూచునట్లుగా చేయుమమ్మా. ఎంతగా పరిశోధించి చూచినప్పటికీ 

నీలోని తేజస్సు అన్యులకెవరికీ లేదను మాట సత్యము.ంఅధుర 

భావనలుసంతోషకరమయిన జీవితము నీ యొక్క దీవన వలననే 

సాధ్యమగునమ్మా. ఓ దీనబంధూ! నాకు వెఆసియున్న ప్రమాదములను 

తుడిచివేసి దీనుడనైన ఈ నన్ను కాపాడుము తల్లీ!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.