జైశ్రీరామ్.
11. ఓం శ్రీమతే నమః.
శతపత్ర వృత్త గర్భ సీసము.
నడిచి రా, కొలిచెదన్ నరహరీ! శుభములన్ - వలచి రా. పదములన్ వదల నేను.
ధరను నీ కరుణకున్ నిరతమున్ యెదురునే - కనుదు నీ దయనికన్ మనసుతోడ.
ఘనుఁడ! శ్రీకరుఁడవే! కరముతోఁ గరముచే - కొనుము, శ్రీ ధరుఁడ! చేకొనుము నన్ను.
సకల! నాకికను నీ వొకఁడవే కలవు. నన్ - విడకు. నా కరమునే. విడకు రామ!
గీ. శరణు శతపత్రగర్భసీసస్థ నృహరి! - వినుత *శ్రీమతీ* యుతుఁడవై వెలుఁగునిమ్ము.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
11వ సీస గర్భస్థ శతపత్ర (చారుమతి) వృత్తము. (భ జ స న భ జ స న గ .. యతి 1-13-17)
రా, కొలిచెదన్ నరహరీ! శుభములన్ వలచి రా. పదములన్ వదల నే.
నీ కరుణకున్ నిరతమున్ యెదురునే కనుదు నీ దయనికన్ మనసుతో.
శ్రీకరుఁడవే! కరముతోఁ గరముచే కొనుము, శ్రీధరుఁడ! చేకొనుము నన్ .
నాకికను నీ వొకఁడవే కలవు. నన్ విడకు. నా కరమునే. విడకు రా!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ నరహరీ!
శుభములనే కోరుచు నీతిగా నిన్ను నేను
కొలిచెదనా?
నీ పాదములను నేను విడువను. నీ
దయ వలన మనస్పూర్తిగా నీ కరుణ కొఱకు భూమిపై ఎల్లప్పుడు ఎదురు
చూచుదును.
ఓ గొప్ప దైవమా! మంగళప్రదుఁడవే, నీ చేతితో నా చేయి పట్టుకొనుము. ఓ శ్రీధరుఁడవైన హరీ! నన్ను
చేకొనుము.
సమస్తమైనవాఁడా!
ఓ అందమైన హరీ! నాకింక నీవొక్కఁడవే ఉంటివి. నన్ను విడువకుము. శతపత్ర వృత్త గర్భ
సీసమున ఉన్న నరహరీ!పొగడఁబడెడి శ్రీమతితో కూడినవాడవై మాకు ప్రకాశము నిమ్ము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.