గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, సెప్టెంబర్ 2023, గురువారం

సన్నిందా సతి నామవైభవ కథా...... నామమంత్ర సాధకులు చేయరాని పది దోషములు.

 జైశ్రీరామ్.

దశాపరాధాలు

శ్లో.  సన్నిందా సతి నామవైభవ కథా శ్రీశేశయో ర్భేదధీ

రశ్రద్ధా శ్రుతిశాస్త్ర దైశిక గిరాం నామ్న్యర్థ వాద భ్రమః

నామాస్తీతి నిషిద్ధ వృత్తి విహిత త్యాగో హి ధర్మాంతరైః

సామ్యం నామ్ని జపే శివస్యచ హరే ర్నామాపరాధా దశ॥  

(భాగవతము)


భావము.

‘మంచివారిని నిందించుట, చెడ్డవారికి దైవ నామ 

వైభవ కథనము, శివకేశవ భేదబుద్ధి, వేదములయెడ అశ్రద్ధ, 

శాస్త్ర ములయెడ అశ్రద్ధ, దేశికులమాటలయందు 

అశ్రద్ధగానుండుట, మాటలాడునపుడు శ్రద్ధ లేకపోవుట,, 

శివకేశవ నామార్థవాద భ్రమ, చేయకూడని కర్మాచరణం, 

చేయవలసిన కర్మలను విడిచిపెట్టుట. పరిత్యాగం, 

ధర్మాంతర సామ్యం’. ఇవి 

దశాపరాధాలు.భగవన్నామ మంత్ర 

సాధకులు చేయరాని పనులు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.