గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, సెప్టెంబర్ 2023, మంగళవారం

నేడు ఉపాధ్యాయ దినోత్సవము సందర్భముగా ఉపాధ్యాయులుగా పునీత జీవనులయిన అందరికీ నా శుభాకాంక్షపూర్వక నమస్కృతులు.

జైశ్రీరామ్. 

ఓంశ్రీమాత్రే నమః.

ఓం శ్రీగురుభ్యోనమః.

శ్లో.  "గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః 

గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"

కం.  గురువే బ్రహ్మయు, విష్ణువు

గురువే, పరమేశ్వరుండు గురువే తలపన్,

గురువే  బ్రహ్మము, కావున

గురుదేవులకంజలింతు గురుతరభక్తిన్.

భావము.  గురువే బ్ర్హ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుఁడు, గురువు సాక్షాత్ బ్రహ్మమే. అట్టి గురువుకు నమస్కరింతును. 🙏🏻

ఉపాధ్యాయులకే చక్కని గుర్తింపు తెచ్చున డా.సర్వేపల్లి రాధాకృష్ణులకు నమస్కరిస్తూ, 

ఉపాద్యాయులుగా పునీతజీవనులైన మహనీయులారా! మీకు నా శుభాకాంక్షలు.

సీ.  స్వార్థంబు విడిచి నిస్వార్థంబుగా విద్య బోధకుఁడై గొల్పు పూజ్యుడతఁడు,

విద్యార్థిలో గొప్ప విశ్వజనీనతన్ పూర్తిగా గొలిపెడి బుద్ధుఁడతఁడు,

నైపుణ్యమును జూపి నాణ్యతనే పెంచు దేశికుండయినట్టి దివ్యుఁడతఁడు,

తరతమ భేదాలు తలపక విద్యను తగినవారలకిచ్చు ధన్యుఁడతఁడు,

తే.గీ.  అట్టిఘనుడుపాధ్యాయుండె యహరహంబు

జ్ఞానదీప్తులు పంచు సుజ్ఞానమూర్తి

దైవమేయతఁడనుటయే తగును ధరను,

అట్టి మహితులకంజలులాచరింతు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.