గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).8వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

8. అజ్ఞాన దుశ్చరిత, లజ్ఞాన భావనల, నజ్ఞాన చైదము లికన్ 

విజ్ఞాన తేజమున విజ్ఞేయ! నిన్ గనుచు సుజ్ఞానినై విడుచుదున్.

సుజ్ఞేయునై వెలుఁగ విజ్ఞుల్ ననున్ దలప ప్రాజ్ఞుండనై నిలువనీ

సుజ్ఞాన తేజము మహాజ్ఞాన మీయు మిక విజ్ఞుండుగాఁ గను సతీ! 

భావము.

ఓ సతీమాతా! నిన్ను చూచుచు మంచి జ్ఞానముపొంది, అజ్ఞానపు 

దుష్ప్రవృత్తిని, అజ్ఞాన భావనలను, అజ్ఞానపు నడవడికను 

విడిచిపెట్టుదును. నేను తెలియఁదగిన వాడినయి,వెలుగునట్టులుగా, 

విఞానవంతులు నన్ను తలచు విధముగా ప్రజ్ఞావంతుడనయి 

నిలుచునట్లు చేయుము. మంచి జ్ఞాన తేజమును, గొప్పజ్ఞానమును, 

విజ్ఞుండుగా ఉండి నిన్ను కనుటకు ఇంక నాకు ప్రసాదించుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.