గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 76వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

76. భూమిన్ జనించు మము నీ మానసంబునను బ్రేమన్ గనన్ మరచితో?

ఏమేమి పాపములు మేమెన్ని చేసితిమొ శ్రీమాత తెల్పఁదగదో?.

ప్రేమామృతాత్మవని మేమున్ నినున్ దలచి నీమంబుతోఁ గొలువమా?

మా మానసంబెఱిఁగి ప్రేమన్ మమున్ గనుమ భూమిన్ శుభాస్పద సతీ!

భావము.

శుభములకు స్థానమయిన ఓ సతీ మాతా! ఈ భూమిపై జనించెడి మమ్ములను 

నీ మనసులో ప్రేమతో చూచుట మరచిపోయినావా తల్లీ?  ఓ శ్రీ మాతా! 

ఎటువంటి పాపకార్యములను మేము గుర్తించి ఆచరించియుంటిమో నీవు 

మాకు తెలియఁజేయ కూడదా తల్లీ? ప్రేమాంఋతమయమయి మా 

త్మస్వరూపిణివని, మేము నిన్ను ఊహించి, నెయమము కలిగి నిన్ను 

సేవింపమా జననీ?భూమిపై మా మనస్సును నీవు తెలుసుకొని, ప్రేమతో 

మమ్ము చూడుమమ్మా. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.