గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 71వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

71.  తల్లీ జగజ్జనని! సల్లీలతో కృపను ముల్లోకముల్ నడుపు నీ

యుల్లంబునన్ గనుచు కల్లోలముల్ తరిమి చల్లంగ నిల్పుము ననున్,

కల్లల్ మదిన్ గనక, సల్లాలితీ గరిమ మళ్ళింతు నా మనసునే

యుల్లాసముం గొలుపు తల్లీ నినున్ దలచి, ముల్లోక పావని! సతీ! 

భావము.

అమ్మా! ఓ లోక మాతా! ఓ ముల్లోక పావనీ! మంచి విలాసవంతముగా కృపతో 

మూడు లోకములను నడిపించెడి నీ మనస్సులో నన్నునూ చూచుచు, 

నాకెదురగుచున్న కల్లోలములను తరిమివేసి, నన్ను చల్లగా నిలుపుమమ్మా. 

మాయలను మనస్సున చూడక, మంచి లాలిత్యము యొక్క 

ఆధిక్యముచేత నా మనసును ఉల్లాసమును కలుగఁజేసే నీపయికి 

మళ్ళింతునమ్మా!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.