గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 68వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

68. కల్లోలముల్ ప్రబలె ముల్లోకముల్ కలగ, తల్లీ కనంగ తగవో.

ముల్లోకవాసివిగ కల్లోలముల్  చెరిపి చల్లంగ కావుమిఁకపై

నుల్లంబులన్ నిలిచి యెల్లప్పుడున్ శుభసముల్లాసమే కొలుపుమా.

కల్లల్ మదిం గనక యుల్లంబులోన నిను సల్లీలఁగాంచెద సతీ!

భావము.

ఓ సతీ మాతా! మూడు లోకములూ కలత పడునట్లుగా కల్లోలములు 

అధికమగుచున్నవి. ఓ తల్లీ! నీవు చూచుటకు సరిపోవా? నీవు 

ముల్లోకములందూ ఉండు తల్లివే కదా. ప్రబలుచున్న కల్లోలములను 

తుడిచివేసి, ఇకపై చల్లగా ఉండునట్లు కాపాడుమమ్మా. మా మనసులలో నీవు 

కలిగించుచుండుమమ్మా. ఈ మాయలను మనసులో గణింపక, నా మనసులో 

నిన్ను మంచివిధముగా చూచెదనమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.