గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 61వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

61  సంపూర్ణ భక్తినిడి, సంపూర్ణ శక్తినిడి సంపూర్ణ ముక్తినిడుమా.

సంపూర్ణ ధ్యాసనిడి,సంపూర్ణ భాషనిడి సంపూర్ణ వాసినిడుమా.

సంపూర్ణవౌ జనని! సంపూర్ణతన్ వెలుఁగు సంపూర్ణ మూర్తివగుమా,

సంపూర్ణచంద్రముఖి సంపూర్ణ వీవగుమ, సంపూర్ణ తేజస సతీ!

భావము.

ఓ సతీ మాతా! నాకు పరిపూర్ణమయిన భక్తి నొసగి, గొప్ప శక్తిని ప్రసాదించి, 

పునర్జన్మ లేనట్టి ముక్తిని ప్రసాదింపుము. సంపూర్ణమయిన ధ్యాసను 

నీపై కలుగఁజేసి, పరిపూర్ణ భాషాజ్ఞానమునిచ్చి, పరిపూర్ణ నైపుణ్యమును 

దయచేయుమమ్మా. పరిపూర్ణమయిన ఓ తల్లీ! పూర్ణత్వముతో 

ప్రకాశించుచు సంపూర్ణమూర్తిగా అగుము. ఓ పూర్ణచంద్రముఖీ! ఓ 

సంపూర్ణ తేజస్వరూపిణీ! పూర్ణముగా నీవే నాకొఱకు అయి 

దయఁజూడుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.