గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).6వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

6. రక్షించు మా జనని! రక్షించుమా, జన నిరీక్షన్ మదిన్ దలచుమా.

రక్షింతువీవని నిరీక్షించు సజ్జనులు మోక్షప్రదా! కనుమికన్. 

సాక్షాత్కరింప కిటు శిక్షింపగా తగున? దాక్షాయినీ! కను మమున్, 

లాక్షారుణప్రభల శిక్షించు దుష్టులను రక్షించు మమ్మిక సతీ!

భావము.

ఓ సాతీ మాతా! రక్షించుము తల్లీ! నీ రక్షణ కొఱకై జనుల ఎదురు చూపులను 

మనసులో తలచుకొని, గుర్తించి, రక్షించుము. ఓ మోక్షప్రదా!  నీవు 

రక్షించుదువని మంచివారైన నీ భక్తులు ఎదురు చూచుచుండిరి. అది నీవు 

గమనించి రక్షించుము. వారికి నీ సాక్షాత్కారమును కలుగుఁజేయక ఈ 

విధముగా శిక్షించుట నీకు తగదు. ఓ దాక్షాయనీ! మమ్ము చూడుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.