గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).25వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

  జైశ్రీరామ్. 

25. పూలన్ గనన్ గలవు, నేలన్ గనన్ గలవు మ్రోలన్ గనన్ గలవుగా. 

చాలింపుమింక, మొరలాలింపుమింక, పరిపాలింపుమా కరుణతో. 

గాలింప లేను నిను, జాలిన్ ననున్ గనుచు, మేలున్ దయన్ గొలుపుమా. 

బాలా! సదా వినుత హేలా! మహత్ సుజన పాలాపరాజిత సతీ!  

భావము. 

గొప్ప మంచివారిని పరిపాలించెడి ఓ అపరాజితా! ఓ సతీ మాతా! ఓ బాలా! 

ఎల్లప్పుడూ పొగడఁబడెడి విలాసము కలిగిన తల్లీ! పూలను చూచినా నీవే 

ఉంటివి. నేలను చూచినా నీవే ఉంటివి, ఎదురుగా చూచినా నీవే ఉంటివి కదా. 

నీ పంతమింక సరిపెట్టుము. ఇంక నా మొరలను వినుము. కరుణతో నన్ను 

పాలింపుమమ్మా. నిన్ను నేనింక వెదకలేను. జాలితో నన్ను చూచుచు దయతో 

నాకు మేలు కలుగఁ జేయుము తల్లీ.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.