జైశ్రీరామ్.
17. అమ్మా భవత్ పదము లిమ్మానసంబునను ముమ్మాటికిన్ నిలువనీ.
పొమ్మన్న నేమిగతి? చిమ్మున్ కనుల్ జలము, లమ్మా కృపన్ గనుమికన్.
సమ్మోదమున్ దెలిపి రమ్మంచు నీ సుతుని నెమ్మిన్ గృపన్ నిలుపుమా.
యిమ్మేను భారమది ముమ్మాటికిన్ తమది సొమ్మీవెగా కన సతీ!
భావము.
అమ్మా! ఓ సతీమతా! ముమ్మాటికీ నీ పాదములను నా మనసున
నిలువనిమ్ము తల్లీ. నీవు కాదని పొమ్మన్నచో నాకు వేరే గతి లేదమ్మా. నా
కన్నులలో నీరు క్రమ్ముకొనును. ఇంక నీవు నన్ను కృపతో చూడుమమ్మా. నీ
యొక్క సమ్మతిని తెలియఁజేసి, రమ్మని నీ కుమారుఁడనయిన నన్ను
ప్రేమతో దయతో నిలుపుము తల్లీ! ఈ నా శరీర భారమింక మీదేనమ్మా, నాకు
అన్ని విధములా ధనమనచో అది వే సుమా.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.