గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఆగస్టు 2024, గురువారం

నర నారాయణుల వృత్తాంతము.

జైశ్రీరామ్.

సహస్ర కవచుఁడు

ఒక రాక్షసుఁడు. ఏక కాలంలో ఐదు వందల ఏళ్లు తపస్సు చేసిన వారి చేతిలోనే మరణించేలా బ్రహ్మదేవునినుండి వరం పొందాడు.

(మరొకచోట దంబోద్భవుఁడనే రాక్షసునకు శివుడిచ్చిన వరంగా చెప్పఁబడి యున్నది)

తనను అంతమొందించుట ఎవరికీ అంత సులభం కాదని తనకు చావుండదనే గర్వంతో అత్యంత ఘోరాతిఘోరమయిన హింసాప్రవృత్తితో ప్రాణికోటినిబాధించేవాడు.

హిరణ్యకశ్యప సంహారానంతరం నరసింహస్వామి నరుడు సింహముగా విడిపోయి  దక్షప్రజాపతి కుమార్తె మూర్తి(లేదా అహింస)కి, ధర్ముడు(బ్రహ్మ కుడి వక్షస్థలంనుండి పుట్టినవాడు, మనుజుల సంపదలకు అధిపతి. ఇతఁడు యమధర్మరాజు కాదు) అనే ప్రజాపతికి విష్ణువు అంశయే నర నారాయణులు కవలుగా జన్మించారు.

(భాగవతము 2వ స్కందము 7వ అధ్యాయములో ఈ కథ ఉన్నది) 

వీరు పుట్టగానే బదరికాశ్రమానికి వెళ్లి తపస్సు ఆచరించారు. లోక కళ్యాణాన్ని సమకూర్చి అన్ని ఫలాలను అందించేది, పాపాలను పోగొట్టేది తపస్సే అని లోకానికి బోధించారు.

అరణ్యంలో నిద్రాహారాలు మాని శరీరాన్ని, మనసును శుష్కింపజేసుకునేది మాత్రమే తపస్సు కాదని, నిత్య జీవితంలో మనం బాగా ఇష్టపడి అనుభవిస్తున్న వాటిపై ఉన్న కోరికను కట్టడి చేసుకొని వాటిని కొద్దిగా తగ్గించుకున్నా అది తపస్సే అని లోకానికి బోధించారు.

      వీరు ఇంద్రపదవికోరి తపస్సు చేయుచున్నారనే సందేహం యింద్రుఁడికి రావడంతో తపో భంగం కలిగించడానికి ఇంద్రుడు రంభమేనక తిలోత్తమలను పంపగా యీ రంభ, మేనక, తిలోత్తమ లాంటి అప్సరసల అందం ఏమాత్రమని తెలియజేసేలా నారాయణుఁడు తమ ఊరువు నుంచి అతిలోక సౌందర్యరాశి ఊర్వశిని సృష్టించి ఇంద్రునికి కానుకగా పంపారు. అపకారం చేసిన వారికి ఉపకారం చేసి, కోరికను గెలిచినవాడు కాదు దేవుఁడు,  కోపాన్ని జయించిన వాడే దేవుడు అని లోకానికి నర నారాయణులు ధర్మసూక్ష్మాన్ని బోధించారు.  

సహస్రకవచుని ఆగడాలకు తాళలేక దేవతలు శ్రీమన్నారాయణుని సహస్రకవచుని బాధలు తమకు తప్పేటట్లు చేయమని ప్రార్థింక్ష్హగా నరనారాయణులుగా వానిని సంహరిస్తున్నట్లు తెలిపాడు.

బ్రహ్మ్ సహస్రకవచునికిచ్చిన వరాన్ని సార్ధకం చేయడానికి స్వామి నరనారాయణులనే రెండు రూపాలను ధరించి నరుడు తపస్సు చేస్తే, నారాయణుడు యుద్ధం చేయగా, నారాయణుడు తపస్సు చేస్తే నరుడు యుద్ధం చేసేవాడు. ఈ విధంగా తొమ్మిదివందల తొంభైతొమ్మిది కవచాలను సహస్రకవచుడు కోల్పోయాడు

(మరియొకచోట త్వష్ట ప్రజాపతి ఇంద్రుని సంహరించే కొడుకు కోరుతూ ఒక పెద్ద యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞపరిసమాప్తి సమయానికి యజ్ఞ గుండం నుండి ఒక పెద్దరూపం ఆ యజ్ఞ గుండంలో నుండి బయటకు వచ్చింది. ఆ విధంగా పుట్టిన వేంటనే ఆ రూపం బ్రహ్మాండం అంతా వ్యాపించేసింది. బ్రహ్మాండం అంతా నిండి పోయింది కావున దానికి వృత్రాసురుడు అని నామకరణం జరిగింది. ఇంద్రుఁడిపై యుద్ధమునకీతఁడు వేళ్ళగా తన వజ్రాయుధంతో ఈతని రెండు కవచాలను పోగొట్టాడు)

ఇక ఒక కవచమే మిగిలి ఉంది. అప్పుడు సహస్రకవచుడు ప్రాణ భయంతో సూర్యుని శరణు వేడాడు. తాను కొంతకాలమే నిన్ను కాపాడ గలనని చెప్పి కొన్నాళ్ళు కాపాడి ఆ తరువాత

సహజ కవచకుండలాలతో కర్ణుడిగా పుట్టి అర్జునుడు అనగా నరునితో వధించబడి ముక్తిని పొందాడు సహస్రకవచుడు. నరనారాయణులే ద్వాపర యుగంలో కృష్ణార్జునులుగా జన్మించారు.

       సూర్యుడి వరంతో కుంతికి జన్మించిన కర్ణుడి అసలు పేరు వసుసేనుడు. వసుసేనుడే సహస్ర కవచుడు. జన్మతహ వచ్చిన కవచ కుండలాలను శరీరం నుంచి వేరుచేసి ఇంద్రుడికి దానంగా ఇచ్చాడు. కవచ కుండలాలను దానం చేయబట్టే అతడికి కర్ణుడు అనే పేరు వచ్చింది. నిజానికి దుర్యోధనుని ప్రాపకం పొందేనాటికే అతనికి కవచకుండలాలు లేవు. ఇంద్రుడికి దానమిచ్చేశాడు. 

ధాన వీర సూర కర్ణ అనే పేరు మనకు పరిచయమే .మహాభారతంలోని ముఖ్య పాత్రలలో కర్ణుడు ఒకరు. జీవితాంతం అడిగినవారికి లేదనకుండా దాన ధర్మాలు చేసిన గొప్ప వ్యక్తి కర్ణుడు. జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. తన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. కర్ణుడు నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. ఎలాంటి కష్టాన్నైనా.. ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు. కర్ణుడి అసలు పేరు వసుషేణుడు

ఇక విషయంలోకి వెళితేపూర్వంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. రాక్షసుడు బ్రహ్మదేవునికి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు. అప్పటినుంచి అతడికిసహస్రకవచుడుఅనే పేరు వచ్చింది. వరగర్వంతో సహస్రకవచుడు సర్వలోకాలనూ నానా హింసలకు గురిచేసి ఆనందించేవాడు. అతడి బాధలు పడలేక సకల ప్రాణికోటి శ్రీ మహావిష్ణువును శరణు కోరగా భయపడకండి,నేను నర, నారాయణ రూపాలలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను. సహస్రకవచుడుకి అంతం సమీపించినప్పుడు తానె నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే స్వయంగా రాక్షసుణ్ణి సంహరిస్తాను అని వారికి ధైర్యం చెప్పి పంపాడు.

హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి రెండురూపాలుగా విడిపోయాడు. నర రూపంనరునిగానూ., ‘సింహరూపంనారాయణునిగాధర్మునికుమారులుగా జన్మించాడు. వారే నర, నారాయణులు. వారిరువురూ పుట్టుకతోనే పరాక్రమవంతులు,విరాయుధులు. అందుకే వారిరువురూ ఆయుధధారులై బదరికావనంలో ఏకాగ్రతతో తపోదీక్ష వహించారు. ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగుతోంది. ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెళుతూనర, నారాయణులను చూసి, వారి ప్రక్కన ఆయుధాలు ఉండుట గమనించి.. తాపసులైన వీరికి ఆయుధాలతో పనేమి? వీరెవరో కపటలు అని భావించి వారికి తపోభంగం గావించి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. వారిమద్య భీకరయుద్ధం జరిగింది. ఎంతకాలమైనా ప్రహ్లాదుడు వారిని జయించ లేకపోవడం చూసి, ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు. శ్రీహరి ప్రత్యక్షమైప్రహ్లాదా.. నర నారాయణులు నా అంశతో జన్మించినవారు. వారిని నీవు గెలవలేవు అని చెప్పాడు. ప్రహ్లాదుడు తన తప్పు తెలుపుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

నర,నారాయణుల తపస్సు కొనసాగుతోంది. వారి తపస్సుకి ఇంద్రుడు భయపడి., వారికి తపోభంగం చేసిరమ్మని అప్సరసలను పంపాడు. వారు తమ రూప, వయో, నృత్య, గానాలతో నర,నారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు.. కానీ, ఫలితం శూన్యం. అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, మీ అందాలు మమ్ములను ఆకర్షించలేవు. ఇంద్రపదవి ఆశించి మేము తపస్సు చేయడంలేదు అని మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి అని తన తొడమీద చరిచాడు. శబ్దం నుంచి అసాధారణ, అద్భుత సౌందర్యరాశి జన్మించింది. తన తొడల నుంచి పుట్టిన సుందరికిఊర్వసిఅని పేరు పెట్టి, ఆమెను అప్సరసలకు ఇస్తూ, ఈమెను మా బహుమతిగా మహేంద్రునకు ఇవ్వండి అని చెప్పి వారిని పంపాడు. మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకున్నాడు. తరువాత మళ్ళీ నర,నారాయణుల తపస్సు కొనసాగించారు. సమయంలో వరగర్వాంధుడైనసహస్రకవచుడువారిదగ్గరకు వచ్చి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు నారాయణుడు అతనితోరాక్షసేశ్వరా..నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కానీ, మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. కనుక, మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు

సహస్రకవచుడు ఒప్పందానికి ఒప్పుకున్నాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతోంది. అలా వేయి సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్రకవచుని వేయి కవచాలలో ఒక కవచాన్ని భేదించగలిగాడు. అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా, నరుడు సహస్రకవచునితో యుద్ధానికి దిగాడు. మరో వేయి సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు. ఇలా నర,నారాయణులిరువురూ కలిసి సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు. ఇక సహస్రకవచునికి ఉన్నది ఒకేఒక కవచం. అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి, యుద్దరంగం వదిలి, పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్లి అభయం ఇమ్మని వేడుకున్నాడు. అప్పుడు సూర్యుడుకలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను., నర,నారాయణుల అనంతరం నీకు నానుంచి విడుదల కలిగిస్తానుఅన్నాడు. సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు. కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు., సహస్రకవచునే.., పసిబిడ్డగా మార్చి, కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. కర్ణుని సంహరించడానికే నర,నారాయణులిరువురూ.. కృష్ణార్జునులుగా జన్మించి, కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించారు.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.