గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఆగస్టు 2024, బుధవారం

నాయక నామగర్భిత రథబంధ కల్పిత విష్ణుస్తుతి సీసము. పురాణం పిచ్చయ్యకవి(1926) కృత సానందోపాఖ్యానము వచనకావ్యమునందలి పద్యము.

జైశ్రీరామ్.

నాయక నామగర్భిత రథబంధ కల్పిత విష్ణుస్తుతి సీసము.
పురణం పిచ్చయ్యకవి(1926) కృత సానందోపాఖ్యానము వచనకావ్యమునందలి పద్యము.
సీ. శ్రీధామ విలసత్ప రాధార నిస్సమి, తాకార వరద నిత్యా మనోజ్ఞ 
సుచరిత్ర మణిగణ ఖచిత విభూషణ,విమల రాజిత వేష విజయమిత్ర 
జలజనయన సురేశ్వర ముఖ్యనుత, సదా శ్రేయ ప్రదాయక సిద్ధగోష్ఠి 
సమ్మోద మాధవ సామగానప్రియ, ధరణీధ రాచ్యుత దురితదూర,
తే.గీ.  సకల లోకాధినాయక వికితరాజ, 
గమన చక్రధరా యజ కపటరహిత, 
రిపుచయక్షయ రూప నిర్జితమనోజ్ఞ, 
ప్రకట గుణ నీలగాత్ర మా? పాహిశాంత!

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.