గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, జులై 2024, గురువారం

నిశ్శ్వాసే న హి విశ్వాసః .. .మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  నిశ్శ్వాసే న హి విశ్వాసః  -  కదా రుద్ధో భవిష్యతి |

     కీర్తనీయమతో నిత్యం  -  హరేర్నామైవ కేవలమ్ ||

తే.గీ.  ఏది చివరిదౌ నిశ్శ్వాసొ యెఱుఁగలేము.

ఎప్పు డది యాగిపోవునో యెవరి కెఱుక?

కనుక హరినె చిత్తంబున కనుచునుండ

పాప ముక్తులమై ముక్తిఁ బడయగలము. 

భావము. బయటకు వెళ్ళిన ఊపిరి (నిశ్శ్వాస) ఎప్పుడు అక్కడే నిలచిపోతుందో 

ఎవరికి తెలుసు? ఆ నిశ్శ్వాసాన్ని ఎవ్వరూ విశ్వసించకూడదు. ఈ కారణం చేత 

ఎల్లప్పుడూ దైవ నామస్మరణను చేస్తుండాలి.

జైహింద్.

Rephrase with Ginger (Ctrl+Alt+E)
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.