గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జులై 2024, మంగళవారం

చిత్రకవితకే అలంకారమనదగిన శ్రీ అలంకారం వేంకటరమణరాజు గారు ప్రొద్దుటూరునుండి నిన్నను మా యింటి వచ్చి మాకానందం కలిగించారు.

 జైశ్రీరామ్.

శ్రీమాన్ నరహరి గారు కూడా నా ఆహ్వానముపై మా యింటికి వచ్చి శ్రీ అలంకారం వేంకటరమణరాజుగారికి సత్కారం చేసేరు. ఇరువురికి నా ధన్యవదములు.
ఈ గ్రంథము వీరి పరిశోధన పన్నెండు భాగములలో మొదటి భాగము.

శ్రీ అలంకారం వారు చిత్రకవిత్వ సాహితీ సాగరాన్ని ఆపోసనపట్టినవారిగా చెప్పవచ్చును. మొత్తం ఎనిమిది భాషలలో ఉన్న చిత్ర కవిత్వములను సేకరించి పరిశోధించి, మొత్తము మన ఆరుద్రగారివలె పన్నెండు భాగాలుగా రూపొందించారు. అందు రెండవ భాగము ముద్రణ పూర్తికావొస్తున్న విషయాన్ని నాకు తెలియజేయుటకు స్వయముగా వారు మా యింటికి వచ్చుట మిక్కిలి ఆనందకరమయిన విషయము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.