జైశ్రీరామ్.
శ్లో. మూర్ఖేణ సహ సంయోగో - విషాదపి సుదుర్జరః
విజ్ఞాన సహ సంయోగ: - సుధారససమ: స్మృత:.
తే.గీ. విషముకన్నను ఘోరమౌ విషము తలప
మూర్ఖ సంగతి జనులకున్, బూజ్యులార!
సుజన సంగతి పరికింప సుధకు మించి
గొప్ప సుధయౌను మనలకు కువలయమున.
భావము. మూర్ఖుడితో సంబంధాలు విషం కన్నా ఎక్కువ విషం. సజ్జనులతో
సహవాసం సుధ అంటే అమృతంతో సమానం.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.