గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జులై 2024, మంగళవారం

గురుసత్కారకాలేతు ... రచన .. డా.పీ.టీ.జీ.వీ. రంగాచార్యులు .. మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్.

డా.పీ.టీ.జీ.వీ. రంగాచార్యులు.

శ్లో.  గురుసత్కారకాలేతు  -  శిష్యదర్శన లాలసా,         

జాయతే వర్ధతే, సత్యం  -  పుత్ర సందర్శనాత్పరమ్.

(రచన .. డా.పీ.టీ.జీ. రంగాచార్యులు) 

తే.గీ.  గురువు సత్కృతిఁ గొనువేళ కూర్మినొప్పు

శిష్యుఁ డటఁ గనఁబడినచో చెప్పనలవి

కాని యానంద మొదవు తత్ కాలమందు

కొమరుఁ గాంచినట్లనిపించు కొమరు మిగుల!

భావము.

గురువు గారికి సత్కారం జరిగే సమయంలో శిష్యుడు కనబడితే, ఆ ఆనందము 

తన కుమారుడు కనబడిన దానికన్నా అధికము ఇదే సత్యము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.